This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో క్వినోవా - ప్రయోజనాలు, మార్గదర్శకాలు | Quinoa During Pregnancy Benefits & Guidelines in Telugu

Diet & Nutrition
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Dec 1, 2025
గర్భధారణ సమయంలో క్వినోవా  - ప్రయోజనాలు, మార్గదర్శకాలు | Quinoa During Pregnancy Benefits & Guidelines in Telugu
Read time7 min

క్వినోవాలో అనేక పోషకాలను ఉన్నాయి. అందుకే అది సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, గర్భిణీ స్త్రీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందా, సురక్షితమేనా అని అందరిలో సందేహం ఉంటుంది. గర్భధారణ సమయంలో క్వినోవా యొక్క విశ్లేషణ ఇక్కడ ఇవ్వబడింది.

గర్భధారణ సమయంలో క్వినోవా యొక్క విశ్లేషణ ఇక్కడ ఉంది.

గర్భధారణ సమయంలో క్వినోవా తినడం మంచిదేనా? ( Is Quinoa safe to eat during pregnancy in Telugu)

మితంగా తింటే స్త్రీలు తమ గర్భధారణ సమయం క్వినోవా తినడం సురక్షితమేనని పోషకాహార నిపుణులు అంగీకరిస్తున్నారు. క్వినోవా అనేది అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, ప్రోటీన్, ఖనిజాలు మరియు ఫైబర్ ఉన్న పూర్తి ప్రోటీన్ కలిగిన శాకాహార ఆహారం. అయినప్పటికీ, ఇది అధిక ఆక్సలేట్ కంటెంటును కలిగి ఉంటుంది. ఆక్సలేట్ ఇనుము మరియు కాల్షియం అరుగుదలను ప్రభావితం చేసే లక్షణాన్ని కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకు ఐరన్ మరియు కాల్షియం చాలా అవసరం.

అంతేకాక, క్వినోవా యొక్క బయటి పొర సాపోనిన్ అనే రసాయనపదార్థంతో కప్పబడి ఉంటుంది, ఇది మొక్కకు సహజ రక్షణ మరియు రోగనిరోధక శక్తిని అందించే విషసమ్మేళనం. సాపోనిన్ ఖనిజాలు మరియు విటమిన్ల అరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాక అతిగా తీసుకుంటే మానవశరీరాలను ప్రభావితం చేసే విష లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే, ఇది కీన్వాలోని బయటిపొరపై మాత్రమే పూత పూయబడుతుంది. కాబట్టి, వంట చేయడానికి ముందు క్వినోవాను బాగా కడగడం ద్వారా దీన్ని తొలగించవచ్చు. అందువల్ల, గర్భధారణలో క్వినోవా తినడం సురక్షితమైనాకూడా, దీన్ని మితంగా తీసుకోవడం, వంట చేయడానికి ముందు నీటితో బాగా కడగడం చేయాలి. మొత్తం మీద వారానికి 2-3 సార్లు తీసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు సిఫార్సు చేస్తారు.

క్వినోవా లోని పోషకవిలువలు ( Quinoa nutritional value in Telugu)

100 గ్రాముల వండిన కీన్వా యొక్క పోషక విలువ క్రింది విధంగా ఉంది:

  • ఇది బార్లీ మరియు మొక్కజొన్న వంటి తృణధాన్యాల కంటే 16% ఎక్కువ ప్రోటీన్ ను అందిస్తుంది. ఇందులో మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. కాబట్టి, ఇది పూర్తి ప్రోటీన్ వనరు. ఇది ప్రత్యేకమైనది ఎందుకంటే మొక్కల ఆహారాలలో సాధారణంగా లైసిన్, హిస్టిడిన్ మరియు మెథియోనిన్ వంటి అమైనో ఆమ్లాలు ఉండవు.
  • వండిన కీన్వాలో ఫైబర్స్ 10% కంటే ఎక్కువ ఉంటాయి. క్వినోవాలో ఉన్న ఫైబర్లో దాదాపు 90% కరగని ఫైబర్.
  • కార్బోహైడ్రేట్ కంటెంట్ 21% ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోరు 53 కలిగి ఉన్నందున, ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగనివ్వదు.
  • ఇది 2 గ్రాముల తక్కువ కొవ్వు కంటెంట్ కలిగి ఉంటుంది.
  • వండిన క్వినోవాలో మాంగనీస్, భాస్వరం, రాగి, ఇనుము, జింక్, మెగ్నీషియం మరియు ఫోలేట్ వంటి విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉన్నాయి.

గర్భధారణ సమయంలో క్వినోవా కలిగించే ప్రయోజనాలు ( Benefits of quinoa during pregnancy in Telugu)

క్వినోవాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో తల్లులకు ప్రోటీన్ చాలా అవసరం ఎందుకంటే ఇది శిశువు చక్కగా పెరగడానికి, వారిలో రోగనిరోధకశక్తి మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. ఇది గర్భధారణ అంతటా ఒక కీలకమైనది. చాలా మంది గర్భిణీ స్త్రీలు మలబద్ధకాన్ని కలిగి ఉంటారు. క్వినోవాలో కరగని ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటుంది, ఇది కరిగే ఫైబర్ కంటే మంచిది. ఇది మలబద్ధకాన్ని నివారించడం ద్వారా మలబద్ధకం వల్ల ఎదురయ్యే అనేక ఇతర సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

క్వినోవాలోని కార్బోహైడ్రేట్లు పిండం మెదడు పనితీరుకు ఇంధనంగా పనిచేసే గ్లూకోజును అందిస్తాయి. అంతేకాక, ఇది గర్భిణీ తల్లిని శక్తివంతంగా ఉంచుతుంది. గర్భం యొక్క ప్రారంభ నెలల్లో శిశువు పెరుగుదలకు అవసరమైన ఫోలేట్ ను కూడా కార్బోహైడ్రేట్లు సరఫరా చేస్తాయి. కీన్వాలోని జింక్ ముందస్తు జననాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శిశువుకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయడానికి కావాల్సిన ఇనుము క్వినోవాలో లభిస్తుంది. ఇందులోని మాంగనీస్ శిశువు యొక్క ఎముక మరియు మృదులాస్థి పెరుగుదలకు సహాయపడుతుంది. శిశువు అభివృద్ధికి మరియు పుట్టుకతో వచ్చే వైకల్యాలను నివారించడానికి ఫోలేట్ ను కూడా కీన్వా అందిస్తుంది.

గర్భధారణ సమయంలో తినడానికి వేడి చేయబడిన క్వినోవా లేదా ముడి కీన్వాలలో ఏది మంచిది?(Which one is safe to eat during pregnancy - reheated or raw quinoa in Telugu)

బాగా కడిగినప్పుడు ముడి క్వినోవా తినడంలో ఎటువంటి హాని ఉండదు. కానీ వండని క్వినోవా రుచిగా ఉంటుంది. అంతేకాక, కీన్వాలో అధిక ఫైబర్ కంటెంట్ మరియు మార్పుచెందని ప్రోటీన్లు ఉన్నాయి. అందువల్ల కడుపు ఉబ్బరించడానికి, గ్యాస్ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మొలకెత్తిన క్వినోవా అలా గ్యోస్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, సులభంగా జీర్ణం కావడానికి ఉపయోగడుతుంది. గర్భధారణ సమయంలో తిరిగి వేడి చేసిన క్వినోవా తినడం కూడా సురక్షితం. దీన్ని మైక్రోవేవ్ లోగాని, స్టవ్వుపై గాని, మూకుడులో గాని, కుక్కరులో వేడి చేయవచ్చు. వేడి చేసిన కీన్వా త్వరలో ఎండిపోతుంది, కాబట్టి వేడి చేసిన తర్వాత తేమగా మరియు మృదువుగా ఉండేలా చూసుకోవడానికి దీనిపై కొద్దిగా నీటిని చల్లవచ్చు.

క్వినోవా తో గర్భవతులు తినదగిన వివిధ వంటలు (Recipe ideas using quinoa during pregnancy in Telugu)

పొద్దునపూట తినే అల్పాహారానికి క్వినోవాతో ఆరోగ్యకరమైన చాలా వంటకాలు చేయవచ్చు. దీన్ని పాలలో ఉడికించి, ఉడికించినప్పుడు, గింజలు మరియు విత్తనాలను జోడించి, తాజా పండ్లను కట్ చేసి, కలపడం వల్ల ఆరోగ్యంగా మరియు రుచిగా ఉండే పదార్థాలు చేసుకోవచ్చు.

  • ఇండియన్ పులావ్, దోశ, సలాడ్లతో సహా అన్ని బియ్యం వంటకాల్లోనూ బియ్యానికి బదులుగా కీన్వాను వాడుకోవచ్చు.
  • క్వినోవా పులావ్ కోసం, ప్రెజర్ పాన్లో నూనె వేడి చేయండి. మసాలా దినుసులు, ఉల్లిపాయలు మరియు టమోటా వేసి, ఆపై కూరగాయలు, ముఖ్యంగా క్యారెట్లు, పచ్చి బఠానీలు మరియు బంగాళాదుంపలను కత్తిరించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి (లేదా కారం పొడి), ఉప్పు వేసి కలపాలి. ఒక కప్పు కీన్వా కోసం, ఒకటిన్నర కప్పుల నీరు కలిపి, ఆ కీన్వాను కుక్కరులో వేసి, కుక్కర్ మూతను మూసివేసి, రెండు విజిల్స్ తర్వాత మంటను ఆపివేయండి.
  • క్వినోవా దోశ పిండి తయారు చేయడానికి, రెండు కప్పుల కీన్వా, పావు కప్పు మినప్పప్పు మరియు ఒక టీస్పూన్ మెంతులను నానబెట్టాలి. రెండు మూడు గంటలు నానబెట్టాలి. మెత్తటి పిండిగా గ్రైండ్ చేసి దోశలు తయారు చేయండి.
  • క్వినోవాను జపనీస్ సుషీ లేదా చైనీస్ ఫ్రైడ్ రైస్లో కూడా ప్రత్యామ్నాయం చేయవచ్చు.
  • తాజా కూరగాయల సలాడులో మొలకెత్తిన కీన్వాను జోడించండి- ఇది మంచి అల్పాహారం.
  • క్వినోవా స్టిర్ ఫ్రై డిన్నర్ కు మంచి ఎంపిక.

ఇలా క్వినోవా ను బహుముఖ పదార్ధంగా వాడుకోవచ్చు. అనేక వంటకాల్లో చేర్చవచ్చు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన తృణధాన్యం. కాబట్టి, స్త్రీలు గర్భధారణ సమయంలో మితంగా తినడం ఆరోగ్యకరమైనది.

References

1. Vega-Gálvez A, Miranda M, Vergara J, Uribe E. 2010. Nutrition facts and functional potential of quinoa (Chenopodium quinoa willd.), an ancient Andean grain.

2. Busso D, González A, Santander N, Saavedra F, Quiroz A, Rivera K, González J, Olmos P, Marette A, Bazinet L. 2023. A Quinoa Protein Hydrolysate Fractionated by Electrodialysis with Ultrafiltration Membranes Improves Maternal and Fetal Outcomes in a Mouse Model of Gestational Diabetes Mellitus. Mol Nutr Food Res.

Tags

Is Quinoa good in pregnancy in Telugu, Quinoa nutritional value in Telugu, What are the benefits of Quinoa during pregnancy in Telugu, Quinoa During Pregnancy: Benefits & Guidelines in English, Quinoa During Pregnancy: Benefits & Guidelines in Hindi, Quinoa During Pregnancy: Benefits & Guidelines in Tamil, Quinoa During Pregnancy: Benefits & Guidelines in Bengali

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.